రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వెల్లడించారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి అంతకు ముందు ఏడాదితో పోల్చితే 17ు నేరాలు తగ్గుముఖం పట్టాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేసి 187 డ్రోన్లతో పెట్రోలింగ్ చేస్తున్నాం. 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకూ మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకూ 16,809 నేరాలు నమోదయ్యాయి. శక్తి యాప్ ద్వారా 164 బృందాలతో నిరంతరం రక్షణ కల్పిస్తున్నాం. గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించ గలిగాం. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 2,911 మందిని అరెస్టు చేశాం’’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీపై సీఎం ప్రశంసలు కురిపించారు. ‘నేరాల నియంత్రణ, పరిశోధన, ప్రజలకు భరోసా.. లక్ష్యంతో ఏపీ పోలీసులు పని చేయాలి. మీ ‘లాఠీ టూ డేటా’ను మరింత ముందుకు తీసుకెళ్లండి’ అని అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేయడంపై ఐపీఎస్ అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |