స్నాప్‌చాట్ తన మొట్టమొదటి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడంతో భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ల సమూహం పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తోంది. స్థానిక ప్రతిభను శక్తివంతం చేయడం, పరిశ్రమ సహకారాలను పెంపొందించడం, క్రియేటర్లు తమ కమ్యూనిటీలను పెంచుకోవడానికి, వారి డిజిటల్ స్టోరీలను డబ్బు సాధించేవిగా చేయడానికి, వాటి సంఖ్యను అధికం చేయడానికి అవకాశాలను మెరుగుపరచడాన్ని ఈ ఆన్-గ్రౌండ్ ఈవెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, స్నాప్‌చాట్ హైదరాబాద్‌లోని ప్రముఖ సృష్టికర్త ఏజెన్సీలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్ - మ్యుటినీ, ఎన్ఆర్ జివై +, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు మద్దతు ఇవ్వడానికి, తదుపరి తరం ప్రతిభకు తోడ్పడేందుకు మరిన్ని భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తోంది. స్నాప్ క్రియేటర్లకు అవగాహన కల్పించడం, మార్గదర్శకత్వం అందించడంపై తన దృష్టిని బలో పేతం చేసింది. స్నాప్ స్కూల్ వంటి కార్యక్రమాలను చాటిచెప్పింది. ఇది ఉద్భవిస్తున్న ప్రతిభావంతులు వారు తమ స్టోరీ చెప్పే నైపుణ్యాలను మెరుగుపరచడంలో, ప్లాట్ఫామ్లో వృద్ధి చెందడానికి, స్నాప్‌చాట్ సాధనాలను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. సావీ ఆన్ స్నాప్ వంటి కంటెంట్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా, భాగస్వాములు తమ స్నాప్ చాట్ కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయ పడటానికి స్నాప్ చాట్ అనుకూలీకరించిన కన్సల్టింగ్ మద్దతు, వనరులను అందిస్తుంది. మానిటైజేషన్ అవకాశాలను మరింత బలోపేతం చేస్తూ, స్నాప్‌చాట్ ప్రపంచ క్రియేటర్-కేంద్రీకృత ఆదాయ వాటా, రివార్డ్ ప్రోగ్రా మ్‌లను కూడా అమలు చేస్తోంది. క్రియేటర్లు తమ ప్రేక్షకులను నిమగ్నం చేస్తూ సుస్థిర కెరీర్లను నిర్మించు కోగలరని నిర్ధారిస్తుంది.
‘‘భారతదేశంలో అత్యంత ఉత్తేజకరమైన క్రియేటర్లకు హైదరాబాద్ నిలయం. మా మొట్టమొదటి స్నాప్‌చాట్ క్రియే టర్ కనెక్ట్ ఐపీని ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. క్రియేటర్లుగా, వినియోగదారులుగా జెడ్ తరం కేంద్రంగా మారడంతో భారతదేశం ఒక నమూనా మార్పునకు లోనవుతోంది. దృశ్యమాన కథ చెప్పడం అయినా, ట్రెండ్లను ఆకర్షించే శక్తి అయినా, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇన్నర్ సర్కిల్ ప్రాము ఖ్యత అయినా లేదా నిజంగా ప్రామాణికంగా ఉండవలసిన అవసరం అయినా, స్నాప్‌చాట్ ఈ మార్పునకు కేంద్రంగా ఉంది. పాప్ సంస్కృతిలో ఈ మార్పుకు నాయకత్వం వహించే క్రియేటర్లను మేం నిమగ్నం చేసే మార్గాలలో క్రియే టర్ కనెక్ట్ ఒకటి. భారతదేశం అంతటా వారిని కలవడానికి మేం ఉత్సాహంగా ఉన్నాం ’’ అని స్నాప్ ఇన్ కార్పొ రేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ అన్నారు.
![]() |
![]() |