విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఈ ఏడాది ఆదివారం వచ్చింది. కాబట్టి, ద్వాదశ రాశుల వారు, 27 జన్మ నక్షత్రాలు కలిగిన పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ లేకపోతే బంగారు రంగు లేదా గోధుమ కలర్ దుస్తులు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు లభిస్తాయని, అనుకున్న పనులు అవుతాయని అంటున్నారు.
ఏ ఆలయానికి వెళ్లడం మంచిది?
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి అధిపతి సూర్యుడు కనుక సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్లడం మంచిది. సూర్యుని ఆలయానికి వెళ్ళలేని వారు సూర్యుడు ఉప ఆలయాలకు వెళ్ళవచ్చు.
![]() |
![]() |