మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ ద్వారా తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు.ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.కాగా, ఈరోజు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ ఉగాది వేడుకల్లో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
![]() |
![]() |