మనతోపాటు పుట్టినవాడికి తిండిలేదు, మనం పెద్ద పెద్ద ప్యాలె్‌సల్లో ఉంటే.. వాడికేమో ఇల్లు లేదు. మీలో చాలా మంది సమాజం వల్ల పైకి వచ్చారు. కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్లుగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను సంపన్నులు తీసుకోవాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలనే ‘మార్గదర్శి-బంగారు కుటుంబం.. పీ4-జీవో పావర్టీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది జరిగితే తన జన్మ చరితార్థమవుతుందన్నారు. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యతను మార్గదర్శులకు ఆయన అప్పజెప్పారు. కెరీర్లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది అవకాశాలు వినియోగించుకోలేకపోతున్నారని, వారందరికీ మాటసాయం, ఆర్థిక సాయం చేసి.. వారి కెరీర్‌ను డిజైన్ చేయాలని పిలుపిచ్చారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్-పార్ట్‌నర్‌షి్‌ప-పీ4 కార్యక్రమాన్ని ‘మార్గదర్శి-బంగారు కుటుంబం.. పీ4-జీవో పావర్టీ’ పేరిట ఆదివారం సాయంత్రం అమరావతిలో సీఎం ప్రారంభించారు. ఆ సందర్భంగాను, అంతకుముందు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ఉగాది సంబరాల్లోను ఆయన ప్రసంగించారు. పేదలను ఎలా ఆదుకోవాలి, వారికోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
![]() |
![]() |