మయన్మార్‌లో భూకంపం కారణంగా భారీ నష్టం సంభవించింది. సహాయక బృందాలు అధిక సంఖ్యలో మృతదేహాలను వెలికితీస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు వైద్య బృందాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 3,085కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మిలిటరీ ప్రభుత్వం ప్రకటించింది. 4,715 మంది గాయపడ్డారని, మరో 341 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
![]() |
![]() |