విజయనగరం జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరం కలిసికట్టుగా జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాక్షించారు. వేడుకల్లో వారణాసి వెంకట నారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం వేద పండితులను మంత్రి సత్కరించారు. సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, ఎమ్మెల్సీలు సురేష్‌బాబు, రఘురాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జేసీ సేతుమాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీవో డి.కీర్తి, దేవదాయ శాఖ ఏసీ శీరిషా, పర్యాటక శాఖాధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |