ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అరకు కేఫ్‌లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పేర్కొన్నారు. పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ను గిరిజనుల వేషధారణ, ఇండియాలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ నెల 29న కూడా ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరడం, వరల్డ్‌వైడ్‌గా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని అన్నారు.
![]() |
![]() |