యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దీపం-2 పథకంలో భాగంగా 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించామన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులకు డబ్బులు అందించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమం అందించదనికి ప్రణాళిక తయారుచేసుకున్నాం అన్నారు నాదెండ్ల మనోహర్.. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతం అయ్యిందన్న ఆయన.. సభ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.. అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. టీడీపీ, బీజేపీతో కలసి ప్రజలు కోసం అంకితభావంతో జనసేన నాయకులు పనిచేయాలని సూచించారు.. గత ప్రభుత్వంలో విశాఖపట్నరంలో లాండ్ అడర్ సమస్య సృష్టించారు. ఋషికొండలో ప్రజాధనంతో ప్యాలస్ నిర్మించారు. విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారు, పర్యావరణం విధ్వసం చేశారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్..
![]() |
![]() |