ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణ చేయాలని ఆలోచనలో ఉన్నారేమోనని, అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. మోదీ నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, గత పదేళ్లలో ఆయన ఎప్పుడూ ఆ కార్యాలయానికి వెళ్లలేదని, ఇప్పుడు వెళ్లడానికి ముఖ్య కారణం ఏదైనా ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.తన పదవీ విరమణ ప్రణాళికల గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో చర్చలు జరపడానికి ఆయన అక్కడకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నట్లు తాను భావిస్తున్నానని, వారు తదుపరి బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమాల ప్రకారం మోదీ కూడా రాజకీయాల నుంచి విరమించాలని కోరుకుంటున్నట్లుగా ఉందని ఆయన అన్నారు.అందుకే ప్రధాని మోదీ మోహన్ భగవత్‌ను కలిసి పదవీ విరమణ పత్రాన్ని సమర్పించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. మోదీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని తాను బలంగా విశ్వసిస్తున్నానని సంజయ్ రౌత్ అన్నారు.
![]() |
![]() |