రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. పరిటాల కుటుంబం స్వయంగా సీతా రాముల కళ్యాణాన్ని జరిపించారు.
ఈ కళ్యాణాన్ని ఎమ్మెల్యే సునీతతో పాటు వందలాది మంది భక్తులు, టీడీపీ నాయకులు వీక్షించారు. కళ్యాణం అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నసనకోట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి కూడా హాజరయ్యారు.
![]() |
![]() |