2025 IPL లో భాగంగా నేడు నేడు ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖెడే స్టేడియం దీనికి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ముంబై జట్టు తమ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం 12 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి, హార్దిక్ పాండ్యా సేన తమ ప్రచారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని కోరుకుంటుంది. చివరి మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు. ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, రోహిత్ ఫిట్‌నెస్‌గా ఉన్నాడా లేడా అనేది మ్యాచ్‌కు ముందు తేలనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అది కూడా టాస్ పడగానే తెలియనుంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంఖడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తోంది. చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో..
![]() |
![]() |