అనంతపురం జిల్లాలో హరిహర క్షేత్రం గా పిలవబడుతూ పెద్దపప్పూరు మండలం అశ్వర్థంలో వెలసిన శ్రీ చక్ర భీమలింగేశ్వరస్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు బాలు శర్మ పంచామృత అభిషేకాలు, మహా మంగళహారతులు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
![]() |
![]() |