అన్నవరం దేవస్థానంలోని ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. బస్సు వెనక్కి పడబోగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆపేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వారు ఓ బస్సులో నర్సీపట్నం నుంచి అన్నవరానికి బయలుదేరారు.
బస్సు ఎగువ ఘాట్ రోడ్డులో మలుపు తిరిగే క్రమంలో యాక్సిల్ విరిగిపోయి వెనక్కి దొర్లింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును కంట్రోల్ చేశారు. దీంతో బస్సులో ఉన్న 55 మంది సురక్షితంగా బయటపడ్డారు.
![]() |
![]() |