ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ డీఎస్సీ అప్లికేషన్‌ ప్రాసెస్‌లో ఇబ్బందులా? అయితే ఈ నెంబర్లను సంప్రదించండి

Education |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 11:08 PM

 ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్‌, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంచారు.


  చాలా కాలం తర్వాత ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనే చేయాల్సి రావడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ఫీజు చెల్లించిన వారు ప్రస్తుతం చెల్లించాల్సిన అవసరం లేదని.. ఆ వివరాలు అప్‌లోడ్‌ చేస్తే చాలని ప్రభుత్వం పేర్కొనడం అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశం. అయితే.. గతంలో చెల్లించిన ఫీజు వివరాలు ప్రస్తుతం డిస్‌ప్లే కాకపోవడం అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది.


అలాగే.. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. గతంలో శాశ్వత కులధ్రువీకరణ పత్రం పొందినవారు దాని ఆధారంగా తాజాగా మరో సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో ఆర్‌ఐ తదితరులు.. శాశ్వత ధ్రువీకరణపత్రంతో తాము మరోసారి కులధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని.. పదో తరగతి టీసీ జిరాక్స్‌తో దరఖాస్తు చేయాల్సిందేనని అంటున్నారు. దీంతో అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారు.


ఇలా డీఎస్సీ దరఖాస్తు సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ కొన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిపార్ట్‌మెంట్ల వారీగా నెంబర్లను ప్రకటించింది. ఈ నెంబర్ల ద్వారా లేదా మెయిల్‌ ద్వారా సమస్యలను తెలుపవచ్చని సూచించింది. వివరాల్లోకెళ్తే..


శాఖల వారీగా ఫోన్‌ నెంబర్లు :


AP Model Schools (APMS)- 7893931292


Juvenile Welfare- 9866735794


APSWREIS- 8978222529


MJP BC Welfare Residential Schools- 954934827


APTWRS (Gurukulam)- 9398185126


Tribal Welfare (ఆశ్రమ్‌)- 9494141670


AP Residential Educational Institutions (APREIS)- 8712625082


Differently Abled Welfare (దివ్యాంగుల సంక్షేమం)- 7893971877


ఏపీ డీఎస్సీ 2025 షెడ్యూల్‌ :


ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు: ఆన్‌లైన్‌ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ


మే 20 నుంచి: మోడల్‌ ఎగ్జామ్స్‌


మే 30 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు


జూన్‌ 6 నుంచి జులై 6 వరకు: డీఎస్సీ 2025 పరీక్షల నిర్వహణ


అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల


తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ


అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజుల తర్వాత తుది కీ విడుదల


ఆ తర్వాత వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటన






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa