ఆధునిక కాలంలో జీవిత పద్ధతులు మారుతున్నా, భార్యాభర్తల మధ్య నమ్మకం మాత్రం ఎప్పటికీ ఆధారశిల. గృహ జీవితాన్ని సాఫీగా, ఆనందంగా కొనసాగించాలంటే, పరస్పర నమ్మకం, తెరవెనుక చర్చలు, కీలక నిర్ణయాలలో భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా భర్తలు కొన్ని కీలక విషయాలను భార్యలతో పంచుకోకుండా దాచడం వల్ల అనేక కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణుల సూచన.
ఏ విషయాలను దాచకూడదు?
భర్తలు తమ జీవిత భాగస్వామితో మాట్లాడకుండా, ఈ క్రింది విషయాల్లో తామేం చేయాలో నిర్ణయించడం మంచి పరిణామాలకు దారితీయదు:
డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టడం
వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడం
అనవసర ఖర్చులతో వస్తువులు కొనుగోలు చేయడం
పిల్లల చదువు, భవిష్యత్ విషయంలో నిర్ణయాలు
అసలు ఇంటికి చెప్పకుండా ప్రయాణాలు చేయడం
ఈ విషయాల్లో భార్య అభిప్రాయం లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయం ఒక సమయంలో గొడవలకు, అనుమానాలకు, చివరికి సంబంధాలలో బలహీనతకు దారి తీసే ప్రమాదం ఉంది.
![]() |
![]() |