దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామాకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు, తాజ్ గ్రూప్ హోటళ్ల మాజీ డైరెక్టర్ అయిన మోహినీ మోహన్ దత్తా, వీలునామాలోని షరతులకు అంగీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. టాటా మిగులు ఆస్తిలో మూడో వంతు భాగాన్ని దత్తాకు కేటాయించారు. దీని విలువ సుమారు రూ. 588 కోట్లు ఉంటుందని అంచనా.మోహినీ దత్తా తన సమ్మతిని తెలియజేయడంతో, టాటా వీలునామా ఎగ్జిక్యూటర్లు బాంబే హైకోర్టు నుంచి ప్రొబేట్ (వీలునామా ధృవీకరణ) పొందే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి మార్గం సుగమమైంది. సుమారు ఇరవై మందికి పైగా ఉన్న లబ్ధిదారులలో, 77 ఏళ్ల దత్తా మాత్రమే తన వాటా విలువకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు.రతన్ టాటా మిగులు ఆస్తిలో (స్థిరాస్తులు, షేర్‌హోల్డింగ్‌లు మినహా) మిగిలిన మూడింట రెండు వంతుల భాగాన్ని ఆయన సోదరీమణులు షిరీన్ జెజీభాయ్ (72), డయానా జెజీభాయ్ (70)లకు కేటాయించారు. వీరిద్దరూ వీలునామాకు ఎగ్జిక్యూటర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |