ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇటీవల ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటివరకు కనీసం 224 మంది మరణించారని, వీరిలో 90 మందికి పైగా సాధారణ పౌరులున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఈనెల 13న ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్‌లోని పన్నెండుకు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్-సయీద్ ఇరవానీ భద్రతా మండలిలో ప్రసంగిస్తూ, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ దాడుల వలన 224 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 329 మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa