మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితమైన ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. దీనికోసం మనం ఇంట్లోనే ఎన్నో ఆరోగ్యకరమైన ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. కానీ, మనం వీటిని నెగ్లెక్ట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో చాలా మంది చపాతీలు, రోటీలను తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెల్దీగా మార్చేందుకు కొన్ని పదార్థాలను మనం వాడే రోటీ, చపాతీలు చేసే పిండిలో కలిపితే హెల్దీ రోటీలను మనం తినొచ్చు. దీనికోసం డాక్టర్ సలీమ్ జైదీ కొన్ని టిప్స్‌ని షేర్ చేస్తున్నారు. ఆయన ప్రకారం, ఆయన చెప్పినట్లుగా చపాతీలను తయారుచేసి తింటే డయాబెటిస్, బిపి, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, జీర్ణ సమస్యల వంటివి దూరమవుతాయి. దీనికోసం ఇంట్లోనే దొరికే కొన్ని ఫుడ్స్‌ని మీరు పిండిలో కలపాల్సి ఉంటుంది. అవేంటంటే
అమర్నాథ్ గింజలు
ఇది కూడా గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో ఈ గింజలు ముందుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉంటారు. ప్రతి కిలో పిండిలో ఓ కప్పు అమర్నాథ్ గింజలు కలిపి ఆరోగ్యకరమైన రోటీలను తయారుచేసి తినొచ్చు.
నువ్వులు
నువ్వులు కూడా శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా చేస్తుంది. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో వీటిని తీసుకోవడం మంచిది. వాములో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా చేస్తుంది. వీటితో తయారుచేసిన రోటీలు మెనోపాజ్ దాటిన ఆడవారికి, వృద్ధులకి చాలా మంచిది.
వాము
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల్ని దూరం చేయడంలో వాము చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం వాముని పొడిలా చేసి ఆ పొడిని రోటీలు తయారుచేసేటప్పుడు పిండిలో కలపండి. దీంతో జీర్ణక్రియ మెరుగ్గా మారడమే కాకుండా రోటీలు రుచిగా కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే తేడా మీకే తెలుస్తుంది.
అవిసెలు
అవిసెలు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని గుణాలు కీళ్ల నొప్పుల్ని కూడా దూరం చేస్తాయి. దీనికి కారణం ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అవిసెల్ని పొడిలా చేసి పిండిలో కలిపి తీసుకుంటే సిరలు శుభ్రంగా మారతాయి. బీపి కూడా బ్యాలెన్స్ అవుతుంది.
మెంతులు
మెంతుల్ని మనం అనేక వంటల్లో వాడతాం. దీని వల్ల ఫుడ్ టేస్ట్ అమాంతం పెరుగుతుంది. ఇవి కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు. చాలా సమస్యల్ని దూరం చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మెంతుల్ని తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా, కడుపు క్లీన్ అవుతుంది. షుగర్‌ని మెంటెయిన్ చేయడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. దీనికోసం మెంతుల్ని కొద్దిగా వేయించి వాటిని పొడిలా చేయాలి. దీని మనం తీసుకునే పిండి పరిమాణాన్ని బట్టి టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పరిమాణంలో తీసుకోవాలి. కప్పు పిండి పావు టీ స్పూన్ పరిమాణంలోనే తీసుకోవాలి. ఎక్కువగా కలిపి చేదుగా మారతాయి. ఈ పిండితో తయారుచేసిన రోటీలు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగ్గా మారుతుంది.
మునగ
మునగ పొడి విటమిన్స్ A, C, E ప్రోటీన్, ఖనిజాల అద్భుతమైన కలయిక. ఇది శరీరంలో మంటని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బాడీని డీటాక్స్ చేస్తుంది. దీనిని పిండిలో కలపండి. తక్కువ పరిమాణంలోనే కలపాలని గుర్తుంచుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa