ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపం ఓ భారతీయ మహిళ అమెరికా ఆఫీసులో ఆకలి తిప్పలు..!

national |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 06:02 PM

మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్‌. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్‌ ఈవెంట్‌లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట 'ది వికెడ్ వెజిటేరియన్' మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్‌లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్‌ప్లేస్‌లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్‌ల శాండ్‌విచ్‌లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్‌వెజ్‌ శాండ్‌విచ్‌లే గానీ ఒక్క వెజ్‌ శాండ్‌విచ్‌ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్‌ శాండ్‌విచ్‌ కావాలని సదరు ఫుడ్‌ కేటరింగ్‌కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్‌ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్‌ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్‌ శాండ్‌విచ్‌ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్‌ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్‌ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్‌కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్‌ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్‌ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa