బీజేపీ రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి అవినీతిమయమైందని.. గతంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని.. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తాను గత పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తానని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బీజపీ ఎంపీ కె లక్ష్మణ్ ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
'గతంలో జరిగిన అవకతవకలు, అవినీతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేద మందులను తయారీ చేసే యంత్రాలు రూ.3.90 కోట్ల రూపాయలను పెట్టి నాసిరకం యంత్రాలను కొన్నారు పరకామణి,అన్నదానంలో నాసిరకం భోజనం, ఆయుర్వేదం ఫార్మసీలో యంత్రాల కొనుగోలు, లడ్డూల్లో కల్తీ వంటివి భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది' అన్నారు. లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
'తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.30 – 11.30 గం.ల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది' అని టీటీడీ తెలిపింది.
'గత బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బిల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు' అని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa