భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి నేడు క్షేమంగా భూమిని చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజులు గడిపి మంగళవారం భూమికి తిరిగి చేరుకున్నారు.ఈ మిషన్‌లో శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు-పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగరీ)-స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో మధ్యాహ్నం 3:01 గంటలకు (IST) సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. కాగా శుభాంశు శుక్లా క్షేమంగా భూమికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa