ప్రస్తుత ఖరీఫ్ లో రెండో పంటకు కూడా నీరు అందించేందుకు కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుండి కేసీ కెనాల్ కు నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేయాలని దృఢ సంకల్పం ఉంటే ఏమైనా సాధ్యమవుతుందన్నారు. సుమారు 7500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa