ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సు నిర్వహణకు సెనేట్ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం జరిగిన సెనేట్ సమావేశంలో నూతన కోర్సు ప్రారంభానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈఏపీసెట్ ద్వారా కల్పించనున్నారు. తొలిబ్యాచ్‌లో 30 మందికి అడ్మిషన్స్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటుచేయాలని భావిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఏయూలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa