జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తమవైపు నుంచి దీనిపై ఇంకా చర్చింలేదని అన్నారు. ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు సహజమేనని తెలిపారు. నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయినా ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa