ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇల్లు తుడిచే నీటిలో కొన్ని కలిపి తుడవండి, మురికితో పాటు ఈగలు కూడా మాయం

Life style |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 11:28 PM

వర్షాకాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండవచ్చు. కానీ, ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణంగా ఇంట్లోకి బొద్దింకలు, ఈగలు, కీటకాలు వస్తాయి. ముఖ్యంగా పగటి పూట ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈగలు ఇంట్లో తినే ఆహారాలపై వాలుతుంటాయి. ఇవి బయట నుంచి బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. దీంతో, ఈ ఆహారాలు తినడం వల్ల టైఫాయిడ్, ఫుడ్ పాయిజన్ ప్రమాదం ఎక్కువ. అందుకే ఈగల్ని ఇంటి నుంచి తరిమికొట్టాలి. ఇక, రోజూ ఇల్లు తుడుస్తూ ఉంటారు. ఇల్లు తుడిచే సమయంలో వంటగదిలో దొరికే కొన్ని నీటిలో కలిపి తుడిస్తే.. నేలకు పట్టిన మురికి వదలడమే కాకుండా ఈగలు కూడా పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


బేకింగ్ సోడా


​బేకింగ్ సోడా ఎన్నో ఇంటి చిట్కాల్లో ఉపయోగిస్తారు. ఇది వంటగదిలో ఎక్కువగా దొరుకుతుంది. బేకింగ్ సోడా జిడ్డు మరకల్ని తొలగించగలదు. నేలపై అనేక రకాల జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి. ఉదహరణకు చక్కెర, నూనె మరకలు జిడ్డు ఎక్కువగా ఉంటాయి. నేలపై జిడ్డుగా ఉండటం వల్ల ఈగలు ఎక్కువగా వస్తాయి. అందుకే జిడ్డు మరకలతో పాటు ఈగల్ని వదిలించుకోవడానికి బేకింగ్ సోడా బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం ఇల్లు తుడిచే నీటిలో ఓ రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను యాడ్ చేయండి. ఈ నీటితో ఇల్లు తుడవడం వల్ల జిడ్డు, నూనె, గ్రీజు మరకలు వదలడమే కాకుండా ఈగలు కూడా ఇంట్లోకి రావు.


నిమ్మరసం


నిమ్మరసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజంగానే శుభ్రపరిచే క్లీనింగ్ ఏజెంట్. నిమ్మరసానికి సూక్ష్మజీవుల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీనికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. అందుకే ఇల్లు మాప్ పెట్టే నీటిలో నిమ్మరసం కలపండి. దీని వల్ల మంచి వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఇందుకోసం రెండు నిమ్మకాయల రసం తీసుకోండి. ఇందుకు సగం బకెట్ నీటిలో కలిపి నేలను తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల నేల మురికి వదలడమే కాకుండా ఈగలు కూడా మాయమవుతాయి.


పిప్పరమెంట్ ఆయిల్, నిమ్మనూనె


పిప్పరమెంట్ ఆయిల్, నిమ్మ నూనె ఇంటికి సువాసన అందించడమే కాకుండా ఈగల పనిపడతాయి. ఈ నూనెల్లో ఏదో ఒకటి తీసుకుని.. రెండు టేబుల్ స్పూన్లు నీటితో నిండిన బకెట్‌‌లో వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ నీటితో నేలను బాగా తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల ఇల్లు మొత్తం మంచి వాసన వస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఇలా నేలను తుడుచుకోవడం ద్వారా ఈగలు కూడా ఇంటి నుంచి దూరంగా ఉంటాయి.


వైట్ వెనిగర్


వైట్ వెనిగర్‌లో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. అందుకే ఈగల్ని తరిమికొట్టడానికి వైట్ వెనిగర్ కూడా మంచి ఆప్షన్. ఇందుకోసం పావు కప్పు వెనిగర్‌ను అర బకెట్ నీటిలో కలపండి. ఈ నీటితో మీ ఇంటి నేలను తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల జిడ్డు మరకలు వదలడమే కాకుండా.. మంచి సువాసన అందిస్తుంది. ఈ నీటితో వంటగదిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ చిట్కా వల్ల ఇంటి నుంచి ఈగలు కూడా పారిపోతాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఈ చిట్కాలు కూడా ఈగల్ని తరిమికొడతాయి


* బిర్యానీ ఆకులతో కూడా ఈగలు, పండ్ల ఈగల్ని తరిమికొట్టవచ్చు. ఇందుకోసం పెద్ద గిన్నె తీసుకోండి. అందులో ఐదు బిర్యానీ ఆకులు, ఐదు కర్పూర బిళ్లలు, రెండు టేబుల్ స్పూన్ల వేప నూనె లేదా ఆవ నూనె వేసి వెలిగించండి. దీని వల్ల పొగతో ఈగలు మాత్రమే కాదు దోమలు కూడా పారిపోతాయి. అయితే, ఈ చిట్కా ట్రై చేసేటప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. శ్వాస సమస్యలు, ఇంట్లో పిల్లలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


* వెల్లుల్లి స్ప్రే కూడా ఇంటి నుంచి దోమల్ని తరిమికొడుతుంది. ఈ చిట్కా కోసం రెండు నల్ల మిరియాల్ని.. 3 వెల్లుల్లి రెబ్బలతో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈగలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. వెల్లుల్లి వాసన వల్ల ఈగలు ఇంట్లోకి రావంటున్నారు నిపుణులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa