హిందువులు మరో పెద్ద పండుగ — దీపావళిని — జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇదే తపాకాయల పండుగ, వెలుగుల పండుగ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.అయితే 2025లో దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయంపై ప్రజల్లో కొంత గందరగోళం కనిపిస్తోంది. దీనిపై పండితులు స్పష్టత ఇచ్చారు.
*దీపావళి తిథి, శుభ సమయం:ఆశ్వయుజ అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 20, 2025 (సోమవారం) తెల్లవారుజామున 3:44 గంటలకు
*తిథి ముగింపు: అక్టోబర్ 21, 2025 (మంగళవారం) ఉదయం 5:54 గంటలకు అందువల్ల, 2025లో దీపావళి అక్టోబర్ 20న జరుపుకోవాల్సిందేనని పండితులు సూచిస్తున్నారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ గణపతి పూజ చేయాలి. అక్టోబర్ 21 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
*దీపావళి రోజున చేసే పూజా విధానం:ఈ పండుగ రోజు హిందువులు లక్ష్మీదేవి, గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొంతమంది తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం కేదారీశ్వర వ్రతం కూడా నిర్వహిస్తారు. పూజా విధానం ఈ విధంగా ఉంటుంది:
-ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పవిత్రత కలిగించాలి.
-గుమ్మం వద్ద ఇరువైపులా దీపాలు వెలిగించాలి.
-పూజా స్థలాన్ని గోమయంతో శుద్ధి చేయాలి.
-ఒక పీటపై ఎర్రని వస్త్రం పరచి, బియ్యం పోసి, ఆపై లక్ష్మీ, గణపతి, కుబేరుని విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచాలి.
-ముందుగా వినాయకునికి పూజ చేయాలి – పసుపు, కుంకుమ, గరికతో సహా.
-లక్ష్మీదేవికి తామర పువ్వులు, సింధూరం, అక్షతలు, పసుపు, పండ్లు, స్వీట్లు సమర్పించాలి.
-నైవేద్యంగా పాయసం (క్షీరాన్నం) నివేదించాలి.
-కుటుంబ సభ్యులందరూ కలిసి హారతి ఇచ్చి, నమస్కారం చేయాలి.
-వ్యాపార సంస్థలు తమ ఖాతా పుస్తకాలు, గల్లా పెట్టెలను పూజా స్థలంలో ఉంచి పూజించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa