మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టు చేతిలో ఎదురైన ఓటమి ఇప్పటికీ తనను బాధిస్తోందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ఆవేదన వ్యక్తం చేసింది. నవీ ముంబైలో జరిగిన ఆ ఓటమి నుంచి బయటపడటానికి ఇంకా సమయం పడుతుందని పేర్కొంది. ఆ మ్యాచ్ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఆ బాధ తనను కొంతకాలం వెంటాడుతూనే ఉంటుందని తెలిపింది.ఇటీవల ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హీలీ ఆ మ్యాచ్ జ్ఞాపకాలను పంచుకుంది. "నిజం చెప్పాలంటే, నేను ఇంకా ఆ ఓటమి నుంచి పూర్తిగా కోలుకోలేదు. టోర్నీలో ఏడు వారాల పాటు మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. కానీ సెమీస్‌లో భారత అడ్డంకిని దాటలేకపోయాం. ఇది చాలా నిరాశపరిచింది. అయితే, మా జట్టు భవిష్యత్తుపై నమ్మకంతో ఉన్నాను" అని హీలీ చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa