భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతూ, తొలి యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్‌ఎస్ మహే నౌక సోమవారం భారత నౌకాదళం సర్వీసులో చేరింది. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఈ నౌకను నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్‌యార్డులో 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను 'సైలెంట్ హంటర్'గా పిలుస్తున్నారు. అత్యాధునిక సోనార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తి కలిగిన 'ఐఎన్‌ఎస్ మహే' రాకతో.. శత్రు జలాంతర్గాములను వేటాడే, తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించే భారత సామర్థ్యం మరింత పటిష్ఠం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa