తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెంకాశీ జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా.... మరో 35 మందికి గాయాలయ్యారు. క్షతగ్రాతులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు మదురై నుంచి సెంకొట్టాయ్కు, ఇంకోటి తెన్కాశి నుంచి కోవిల్పట్టికి వెళ్తున్నాయి. ఈ క్రమంలో మదురై-సెంకొట్టాయ్ కైసర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొట్టాడు. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa