రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం తాలూకా సొమ్ముని 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa