తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు కొనసాగుతాయని టీటీడీ (TTD) బోర్డు నిర్ణయించింది. ఇవాళ అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ఈ కీలక ప్రకటన చేశారు. మొదటి మూడు రోజులకు ఆన్‌లైన్ ద్వారా ఈ-డిప్ టోకెన్లు జారీ చేస్తామని, మిగిలిన ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా దర్శన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa