మనం హెల్దీగా ఉండాలన్నా, మన జుట్టు ఆరోగ్యంగా ఉండాన్నా కూడా సరైన లైఫ్‌స్టైల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒత్తిడి, కెమికల్ ప్రోడక్ట్స్, సరిలేని కేర్ ఇలాంటి అన్నీ కారణాల వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. దీంతో పొడవైన జుట్టు అనేది చాలా మంది కలగానే మారిపోయింది. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే జుట్టు రాలడం తగ్గి పెరగడానికి మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జుట్టు అనేది మన అందాన్ని మాత్రమే కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే, జుట్టు విషయంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. అలానే మీరు కూడా మీ జుట్టుని కాపాడుకుని ఒత్తుగా పెంచుకునేందుకు ఆయుర్వేదాన్ని ఆశ్రయించొచ్చు. దీనికోసం యోగా గురు కైలాష్ బిష్ణోయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసుకున్నారు. ఆయన ప్రకారం, ఓ చక్కని డ్రింక్‌ని తీసుకుంటే ఆటోమేటిగ్గా జుట్టు పెరుగుతుంది. మరి ఆ డ్రింక్ ఏంటో తెలుసుకోండి.
డ్రింక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆపిల్
దానిమ్మ
బీట్‌రూట్
క్యారెట్
ఉసిరి
ఎలా తయారుచేయాలి?
జుట్టు రాలడాన్ని తగ్గించే డ్రింక్‌ని తయారుచేయడం చాలా ఈజీ. దీనికోసం అన్నీ పదార్థాలను కూడా మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేయాలి. దీనిని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. అయితే, డ్రింక్‌ని ఎట్టిపరిస్థితుల్లో కూడా వడగట్టొద్దు. మీ అవసరాలు, ఇష్టాన్ని బట్టి పరిమాణాన్ని అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది
ఇందులో వేసిన పదార్థాలన్నీ కూడా జుట్టుని హెల్దీగా చేసేవే. ప్రతీ పదార్థంలోనూ జుట్టుని పెంచే విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడమే కాకుండా బాడీ నుండి ట్యాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి. దీని వల్ల మరో బెనిఫిట్ ఏంటంటే చర్మాన్ని కూడా మెరుగ్గా మారుస్తుంది. అందుకే, ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.
ఏబిసి జ్యూస్‌లానే
సాధారణంగా, ఇప్పుడు పాపులర్ అయిన ఏబిసి జ్యూస్‌లానే ఇది కూడా. ఇందులో ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో పాటు దానిమ్మ, ఉసిరికాయలు ఎక్స్‌ట్రా యాడ్ అయ్యాయి. ఇవి రెండు కూడా జుట్టుని పెంచే పవర్‌ఫుల్ పదార్థాలుగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచివి. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
వీటితో పాటు
జుట్టు పెరగాలంటే డ్రింక్‌తో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. మన డైట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ప్రోటీన్, ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటాం. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. పొల్యూషన్‌లో తక్కువగా ఉంటూ కెమిల్ ప్రోడక్ట్స్‌ని తక్కువగా వాడాలి. ఇలాంటి జాగ్రతల్ని తీసుకుంటే చాలా వరకూ జుట్టు సమస్యలు తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa