మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాహితుల కోసం "ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్" అనే కొత్త పన్ను విధానాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే, వారిని ఒక ఆర్థిక యూనిట్‌గా పరిగణించి, ఉమ్మడి ఆదాయంగా ప్రకటించి, దానిపై పన్ను చెల్లించవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం అమల్లో ఉంది. ఇది అమలులోకి వస్తే దంపతుల పన్ను భారం తగ్గి, ఆర్థిక ప్రణాళిక మెరుగుపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa