ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BSNL Offers: యూజర్ల కోసం రూ.1 రీచార్జ్ ప్లాన్..! ఇదే లాస్ట్ ఛాన్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 10:02 PM

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపించడంతో, పాపులర్‌ రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. కంపెనీ ఈ ప్లాన్ తిరిగి వచ్చినట్లు తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్‌ లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఇది వన్‌టైమ్‌ అవకాశమని స్పష్టం చేసింది. రూ.1 ప్లాన్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌ను పూర్తిగా విత్‌డ్రా చేస్తుందని BSNL తెలిపింది. భవిష్యత్తులో ఈ ప్లాన్‌ను మళ్లీ అందిస్తారా లేదా అనే దానిపై కంపెనీ ఎలాంటి సూచన చేయలేదు.రూ.1 ప్లాన్ (Rs.1 prepaid plan) కొత్తగా BSNL సిమ్ తీసుకునే వినియోగదారులు లేదా ఇతర నెట్‌వర్క్ నుంచి BSNLకి పోర్ట్ అయ్యే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటా లభిస్తుంది. ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యాలిడిటీ సిమ్ యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఫస్ట్-టైమ్ యూజర్లకు, తక్కువ ధరలో సెకండరీ సిమ్ కోసం చూస్తున్న వారికి లేదా BSNL నెట్‌వర్క్ సేవలను ట్రై చేయాలనుకునే వినియోగదారులకు సరైన ఆప్షన్‌గా ఉంటుంది. తక్కువ ధరలో బేసిక్ కనెక్టివిటీ కోరుకునే వినియోగదారుల కోసం రూ.1 ప్లాన్ తీసుకొచ్చారు. బ్యాకప్ నంబర్ అవసరమయ్యే వ్యక్తులు, విద్యార్థులు లేదా BSNL నెట్‌వర్క్ కవరేజ్ బలంగా ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు.రూ.1 ప్లాన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా ఆథరైజ్డ్ BSNL రిటైలర్స్ దగ్గర సిమ్ తీసుకోవాలి లేదా పోర్ట్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ కోసం అవసరమైన KYC ప్రక్రియను పూర్తి చేయాలి. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత రూ.1 ప్లాన్ బెనిఫిట్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి.అంతే కాకుండా BSNL మరో కొత్త ప్లాన్‌ “భారత్ కనెక్ట్ ప్లాన్”ను కూడా తీసుకొచ్చింది. దీని ధర రూ.2,626. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌ యూజర్లకు రోజుకు 2.6GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. ఈ ప్లాన్ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 24 వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు BSNL రీఛార్జ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ లేదా కంపెనీ అధికారిక చాట్‌బాట్ BReX ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు, BSNL తన సూపర్‌స్టార్ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై కూడా ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ప్లాన్ ఇప్పుడు రూ.999 నుంచి రూ.799కి తగ్గింది. ఇది మంత్లీ 200Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. 12 నెలలకు ముందే చెల్లిస్తే కస్టమర్లకు BSNL 20% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను మార్చి 31 వరకు కొత్త ధరతో, డిస్కౌంట్ ఆఫర్‌తో పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa