ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి కందనకాయ తింటే లాభాలా? నష్టాలా?

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 02:45 PM

చిచాలా మంది చికెన్‌ను ఇష్టంగా తింటుంటారు. చికెన్‌లో కూడా కందనకాయల్ని ఇష్టపడే సపరేటు బ్యాచ్ ఉంటుంది. వీటిని డీప్ ఫ్రై చేసుకుని చాలా మంది తింటుంటారు. కందనకాయలు.. చికెన్‌తో పోలీస్తే ధర కూడా తక్కువే. ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదే. కెన్ తో పాటు కోడి కందనకాయ (గిజార్డ్), కాళ్లు వంటి భాగాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలపై డైటీషియన్లు కీలక సూచనలు చేశారు. కందనకాయలో ప్రోటీన్, ఐరన్, జింక్, బి విటమిన్లు అధికంగా ఉండి, కండరాల నిర్మాణం, రోగనిరోధక శక్తికి, రక్తహీనత నివారణకు సహాయపడతాయని తెలిపారు. అయితే, ఇందులో కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు దారితీయవచ్చని, సరిగా ఉడకకపోతే ఫుడ్ పాయిజనింగ్ కలిగించవచ్చని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa