తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో.. అవన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇది నేను కలలోనూ అనుకోలేదు. శివశంకర్.. నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో అని లేఖ రాసి.. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకున్న వివాహిత . తిరుపతి జిల్లా పుత్తూరులో ఘటన .... పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ(28), తొరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. వీరు ప్రేమ పెళ్లికి సిద్ధపడగా.. కులాలు వేరు కావడం, శివశంకర్ పని లేక జులాయిగా తిరుగుతున్నాడని పెళ్లికి అంగీకరించని పద్మ తల్లిదండ్రులు. అయినా ఆమె అతన్ని 2019లో వివాహం చేసుకోగా వీరికి తేజ(6), లాస్య(5) కుమార్తెలు సంతానం కలగగా, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు ప్రతినెలా ఇబ్బంది పడుతుండడంతో, భర్త ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదని.. శివశంకర్‌ను మందలించిన పెద్ద మనుషులు . కుటుంబాన్ని బాగా చూసుకుంటానని, తనకు శ్రీసిటీలో ఉద్యోగం వచ్చిందని వారికి చెప్పిన భర్త.. అయితే బయటకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసిన పద్మ.. డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావా అని ప్రశ్నించగా, భర్త చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపం చెంది, లేఖ రాసి, బెడ్ రూంలో ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి, తానూ హాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత. శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa