ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక వారంలో ఒక్కోక్కరు ఎంత చికెన్ తినోచ్చు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 11:04 PM

ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల అవగాహన ఉంది. తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా మంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రోటీన్ కోసం చాలా మంది చికెన్ తింటున్నారు. ఇక, చికెన్ ప్రియుల జాబితా చాలా పెద్దది. అందుకే చికెన్ పేరు చెబితేనే చాలా మందికి నోరు ఊరుతుంది. సండే వచ్చిందంటే చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ 65 ఇలా రకరకాలుగా వండుకుని తింటుంటారు.


ప్రోటీన్ కోసం చికెన్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే, ఓ లెక్క లేకుండా చికెన్ తినేస్తుంటారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. ఈ విషయంపై తరచుగా పరిశోధనలు జరుగుతుంటారు. అలాంటి ఓ అధ్యయనం మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు. ఈ కొత్త పరిశోధన ప్రకారం వారానికి ఎంత చికెన్ తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది అన్న విషయాలు వెల్లడయ్యాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


 అధ్యయనం ఏం చెబుతోంది?


​న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కడుపు, పేగు వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణశయాంతర పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.


మహిళల కంటే పురుషులకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. దీని కోసం 19 ఏళ్లు ఇటలీకి చెందిన 4869 మందిపై రీసెర్చ్ జరిపారు. ఎక్కువ చికెన్ తినేవారు పేగు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.


అధ్యయనంలో వెల్లడైన విషయాలు


​పరిశోధనలో వెల్లడైన వివరాలు


వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినే వారు.. వారానికి 100 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినేవారి కంటే 27 శాతం ఎక్కువ మరణ ప్రమాదం కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది.


పురుషులలో ఈ ప్రమాదం 61 శాతానికి పెరిగింది. అంటే 100 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినే పురుషుల్లో అకాల మరణం దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ.


వారానికి 100-200 గ్రాముల చికెన్ తినేవారికి జీర్ణవ్యవస్థ క్యాన్సర్ నుంచి మరణించే ప్రమాదం 65 శాతం ఎక్కువ.


300 గ్రాముల కంటే ఎక్కువ పౌల్ట్రీ తినేవారికి జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్ నుంచి చనిపోయే ప్రమాదం 127 శాతం ఎక్కువ. ఈ ప్రమాదం పురుషుల్లో 161 శాతం ఎక్కువగా ఉంది.


అసలు ఎంత చికెన్ తినాలి?


హెల్త్ లైన్ ప్రకారం.. US ఆహార మార్గదర్శకాలు 2020-2025 ప్రకారం.. 2,000 కేలరీల ఆహారంలో లీన్ మీట్ పౌల్ట్రీ, గుడ్ల నుంచి వారానికి 740 గ్రాముల ప్రోటీన్ చేర్చాలని సిఫార్స్ చేయబడింది. చికెన్‌కు నిర్దిష్ట పరిమితి లేదు. అయితే, రెట్ మీట్ కంటే చికెన్ బెస్ట్ అని ఇలా చెప్పారు. వారానికి చికెన్ 300 గ్రాముల కంటే తక్కువ తినడం మంచిదని పరిశోధన చెబుతుంది. 100 గ్రాముల కంటే తక్కువగా తినడం ఇంకా సురక్షితమని చెబుతుంది.


ఎక్కువగా తింటే ఏమవుతుంది?


ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. వారానికి 300 గ్రాముల కంటే తక్కువ తినడం సురక్షితం. ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది పేగు సమస్యలకు కారణమవుతాయి.


అధ్యయనాలు కూడా ఎక్కువగా చికెన్ తినడం వల్ల జీర్ణవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, కొన్ని జీర్ణశయాంతర క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నాయి. అందుకే 300 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినడం మంచి ఆప్షన్.


అంతేకాకుండా వీటితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం మంచి ఆప్షన్. వీటితో పాటు పప్పుధాన్యాలు, బీన్స్, సోయా ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మంచి పోషకాల్ని అందిస్తాయి. అంతేకాకుండా బాగా వేయించిన చికెన్, స్పైసీ చికెన్ తినడం వల్ల ఈ సమస్యలు ఎక్కువుతాయి. అంతేకాకుండా ఇంజెక్షన్లు ఇచ్చే కోడి మాంసం వల్ల ఈ ప్రమాదం ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa