ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఆరోపణలు.. కంపెనీల ఖండన

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 10:22 AM

ప్యాకెట్ పాలలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితమయ్యాయని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను కంపెనీలు ఖండిస్తున్నాయి. తమ ఉత్పత్తులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, తయారీలో వైఫల్యం లేదని, పంపిణీ సమయంలో కోల్డ్ చైన్ లోపాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. పాలు పితికే దశ నుంచి రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ సమయంలో కల్తీ జరిగే అవకాశాలున్నాయని, పాశ్చరైజేషన్ తర్వాత సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరుగుతుందని, అందుకే ప్యాకెట్ పాలను మరిగించకుండా వాడకూడదని సూచిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa