ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా సంచలనం.. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టింది

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:03 AM

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును అధిగమించి, టీమిండియా చరిత్ర సృష్టించింది. 2024 నుంచి 2026 వరకు వరుసగా 11 విజయాలు సాధించి, టి20 వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా 2022 నుంచి 2024 వరకు 8 విజయాలతో అగ్రస్థానంలో ఉండేది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ విఫలమైనా, ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. బౌలర్లు కూడా అదరగొట్టడంతో టీమిండియా భారీ తేడాతో విజయం సాధించింది. ఆటగాళ్లలో పోటీతత్వం, సమష్టి కృషి టీమిండియా విజయానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa