ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే సూర్య గ్రహణం.. పండితులు ఏం చెప్పారంటే?

Astrology |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 05:57 PM

ఆకాశంలో రేపు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. మంగళవారం సంభవించే సూర్య గ్రహణం రింగ్ ఆఫ్‌ ఫైర్‌గా కనువిందు చేయనుంది. అయితే ఈ సూర్యగ్రహణం గురించి పండితులు కీలక విషయాలు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం గురించి గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే తమ పనులు చేసుకోవడం, ఆహారం తీసుకోవడం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని, కాబట్టి ఇక్కడ ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదని సూచిస్తున్నారు.అయితే భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపిస్తుందా? ఫిబ్రవరి 17న ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గున అమావాస్య రోజున గ్రహణం ఏర్పడనుంది. దాదాపు ఇది రెండు నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. యూటీసీ నివేదిక ప్రకారం.. ఉదయం 7 : 01 గంటలకు ప్రారంభం, అంటే భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 : 31 గంటలకు ఇది ఏర్పడుతుంది.ఈ సూర్య గ్రహణం అగ్నివలయం ఆకారంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ఎక్కువగా అంటార్కిటికాలో కనిస్తుంది. తర్వాత దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. చాలా మంది అగ్ని వలయ సూర్య గ్రహణాన్ని చూడాలని అనుకుంటే మాత్రం వారికి నిరాశే అని చెప్పాలి. ఈ గ్రహణం వార్షిక దశ భారత్‌లో కనిపించదు, కొన్ని ప్రాంతాలలో మాత్రం పాక్షిక సూర్య గ్రహణాన్ని చూడ వచ్చును.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa