ట్రెండింగ్
Epaper    English    தமிழ்

HPV వ్యాక్సిన్లు సురక్షితమేనా?

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 02:47 PM

దేశవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంతో చేపట్టిన HPV వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిపుణుల ప్రకారం HPV వ్యాక్సిన్లు సురక్షితమైనవే. WHO, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్‌ ప్రీవెన్షన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ టీకాను సేఫ్‌ అని గుర్తించాయి. 9–14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. టీకా తర్వాత స్వల్ప జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి వంటి చిన్నపాటి దుష్ప్రభావాలు కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. వంధ్యత్వం వంటి సమస్యలతో ఈ వ్యాక్సిన్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa