రూ.25 వేల బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి Motorola నుంచి కొత్త ఆప్షన్ వచ్చింది. Motorola Edge 70 Fusion స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన మల్టీమీడియా ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా నిర్ణయించగా, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇక 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉన్న హైఎండ్ మోడల్ ధర రూ.32,999. పాంటోన్ బ్లూ సర్ఫ్, పాంటోన్ కంట్రీ ఎయిర్, పాంటోన్ సిల్హౌట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 12 నుంచి సేల్ ప్రారంభం కానుండగా, Flipkart, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ IP68, IP69 రేటింగ్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ టెస్ట్‌ను కూడా పాస్ చేసింది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల సూపర్ HD+ (1.5K) ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్ప్లే ఇవ్వబడింది. HDR10+ సర్టిఫికేషన్, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో స్క్రీన్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. డిస్ప్లే రక్షణ కోసం Corning Gorilla Glass 7i ఉపయోగించారు.బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 7,000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను అందించారు. 68W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే ఇవ్వబడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 52 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్, Hi-Res ఆడియో వంటి ఫీచర్లు మల్టీమీడియా అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. భద్రత కోసం ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, థింక్‌షీల్డ్ సెక్యూరిటీ వ్యవస్థను కూడా అందించారు.పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే Android 16 ఆధారిత హెలో UIతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ 3 OS అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని ప్రకటించింది.కెమెరా విషయానికి వస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 710 మెయిన్ సెన్సార్ (OISతో)తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఇవ్వబడింది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆటో నైట్ విజన్, ఆటో స్మైల్ క్యాప్చర్, డ్యూయల్ క్యాప్చర్, ఫేస్ రీటచ్, జెస్చర్ క్యాప్చర్, HDR, లైవ్ ఫిల్టర్లు, మాక్రో, పనోరమా, ప్రో మోడ్ వంటి పలు ఫోటోగ్రఫీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఇక AI ఫీచర్ల విషయానికి వస్తే, మోటో ఏఐ 2.0లో AI ఇమేజ్ స్టూడియో, స్కెచ్ టు ఇమేజ్, స్టైల్ సింక్, టెక్స్ట్ టు స్టిక్కర్, అవతార్ క్రియేషన్ వంటి సృజనాత్మక టూల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త టెక్నాలజీ, శక్తివంతమైన చిప్, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కలగలిపి ఈ ఫోన్ వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నవారికి ఇది పరిశీలించదగిన ఎంపికగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa