ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు అందిస్తోంది. ఈ క్రమంలో ఈ ఫోటో షేరింగ్ సోషల్ మీడియా సర్వీస్‌గా చాలా సంవత్సరాల నుంచి ప్రజాదరణ పొందింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫారమ్‌లోని స్టోరీస్ ఫీచర్ భారీ ఆదరణ దక్కించుకుంది. వినియోగదారులు 24 గంటల పాటు ఫోటోలు, వీడియోల ద్వారా తాము చేస్తున్న పనులను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో స్టోరీస్ విషయంలో కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోంది.
ఇప్పటి వరకు ఎవరైనా యూజర్ తమ స్టోరీస్‌లో ఏవైనా అధికంగా పోస్ట్ చేస్తే రైలు బోగీల్లా కనిపించేవి. ఇక నుంచి అలా కనిపించదు. అధిక పోస్టులను ఇన్‌స్టాగ్రామ్ చూపించదు. యూజర్ పోస్ట్ చేసిన మూడు స్టోరీలను మాత్రమే మనకు చూపిస్తుంది. కొద్దిమంది యూజర్లకు మాత్రమే ఈ అప్‌డేట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ మార్పులను యూజర్లందరికీ అందించే ముందు పరీక్షలు చేస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఒకేసారి 100 కథనాలను పోస్ట్ చేయవచ్చు. అయితే ఈ కొత్త లేఅవుట్‌తో యూజర్లు మిగిలిన స్టోరీలను చూడటానికి "షో ఆల్" బటన్‌ను నొక్కాలి. లేకపోతే, ఈ కొత్త అప్‌డేట్‌తో ఉన్న వినియోగదారులు కేవలం మూడు కథనాలను మాత్రమే చూడగలరు.