భారత్‌లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్‌లో కియా ఫ్లాగ్‌షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 ఈవీ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి కాగా సాంకేతికంగా అత్యున్నతమైన అడ్వాన్స్డ్ కారుగా కస్టమర్ల ముందుకు రానుంది.కియా ఈవీ6 కేవలం 5.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పరిమాణం ప్రకారం కియా ఈవీ6 మిడ్‌సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలను తలపిస్తుంది. కియా ఈవీ6 ధర దాదాపు రూ 60 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. కియా ఈవీ6ను పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తారు. ఈ వాహనం త్వరలో రానున్న హ్యుందాయ్ ఐనిక్ 5, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్‌లకు దీటైన పోటీ ఇవ్వనుంది.