అనంతపురం: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర సదుం కొండ క్రింద కనములో వెలసిన శ్రీ భైరాగి స్వామి దేవాలయంలో దైవ దర్శనం కోసం తనకల్లు మండలంలోని గ్రామాల భక్తాదులే కాక ఇంకా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ప్రతి శనివారం దైవ దర్శనం కోసం విచ్చేస్తున్నటు ఆలయ ధర్మ కర్త చారుపల్లి కృష్ణా రెడ్డి తెలియచేసారు. అలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం మరియు రాత్రి పూట చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రజలు విచ్చేసి భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియ చేసారు.