అల్లూరి జిల్లా, ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్ధానిక ములియపుట్టు పంచాయితీ పరిధిలో భీరం గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర నేడు అంగరంగ వైభవంగా గ్రామస్థులు నిర్వహించారు.ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ నిర్వహిం చడంతో మన్యంలో అనేక ప్రాంతాలా నుండి కొన్ని వేలమంది విచ్చేసి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దయ, కరుణ,ఆశీస్సులు పొందు తారు. అలాగే మూడేళ్ళకు సరిపడే విధంగా కమిటీ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమా లు,దింశా నృత్యాలు,స్టేజ్ డ్యాన్సులు, కోలాటాలు,విద్యుత్ అలంకరణ తిలకించి మంత్రముగ్ధులవుతారు.
ముఖ్యంగా ఈ జాతరను నిర్వహించే కమిటీ వారే కాకుండా గ్రామస్థులు అందరూ ఒకే మాట మీద ఒకే విధంగా వ్యవహరిస్తూ జాతరలో ఎటువంట అవంచనీయ సంఘటనలు, కొట్లాటలు, అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పరమైన చర్యలు చేపడతారు.అలాగే గ్రామ యువత కూడా అన్ని విధాలా సహకరిస్తూ పండుగ విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహిస్తారు అనేది జాతరకు తిలకించేందుకు వచ్చిన వారందరికీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది.ఏది ఏమైనప్పటికీ మండల పరిధిలో భీరం చిన్న గ్రామం అయినప్పటికీ పండుగ అయితే గ్రామస్థులందరూ కలిపి చాలా అంగరంగ వైభవంగా అందరూ గుర్తుంచు కునేలా నిర్వహించారని జాతరకు తిలకించేందుకు వచ్చిన భక్తులందరూ కొనియాడారు.