తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరో గుడ్ న్యూస్ అందించింది. మరో 10,105 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఎస్సీ గురుకులాల్లో 2,267, ఎస్టీ గురుకులాల్లో 1,514, బీసీ గురుకులాల్లో 3,870 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టీఎస్పీఎస్సీ ద్వారా 995 నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలోనే మరిన్ని పోస్టుల భర్తీ ఉంటుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.