తెలంగాణలో మంగళవారం పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ప్రారంభమైనా, నేటికీ పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టలేదని విమర్శించారు. తాము చేపట్టిన బంద్కు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మద్దతు పలకాలని కోరారు.