ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఆ సంస్థలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా హెచ్ఆర్ విభాగానికి చెందిన టాలెంట్ అక్విజేషన్ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టింది. నేడు ట్విట్టర్ సైతం 100 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు ప్రకటించింది. ఒక దశాబ్దానికి పైగా అక్కడ ఉన్న వారు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇది నిజంగా కఠినమైన రోజు అంటూ విచారం వ్యక్తం చేశారు.